Wife Died Unable to Bear the Death of Her Husband in Anantapur District :తన కళ్ల ఎదుటే భర్తను అతి కిరాతకంగా చంపిన విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. స్థానిక జేఎన్టీయూ సమీపంలో నిన్న రాత్రి ( ఆదివారం) ఎస్కే యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ కె.వి మూర్తి రావ్ గోఖలే (59) ను అతని మేనల్లుడే దారుణంగా హత్య చేశాడు. భర్త మరణాాన్ని తట్టుకోలేక శోభ నిన్న రాత్రి మృతి చెందింది. భార్యభర్తల మృతితో ఆయన ఇంటి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఉద్యోగం ఇప్పిస్తానని విషయంలో తన సొంత మేనల్లుడు ఆదిత్యా నుంచి మూర్తి రావు డబ్బులు తీసుకున్నాడని నేపథ్యంలో ఇరువురికి గొడవ జరిగింది. ఈ గొడవలో మాటామాటా పెరిగి తన వెంట తీసుకెళ్లిన కత్తితో పలుమార్లు ఛాతి, పొట్ట, గొంతుపై పొడిచాడు. అడ్డొచ్చిన అత్తను పక్కకు నెట్టి దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన మూర్తి రావ్ అక్కడికక్కడే మృతి చెందారు. మేనమామను హత్య చేసి తప్పించుకోబోతున్న నిందితుడు ఆదిత్యను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.