మాయమాటలతో మూడు పెళ్లిళ్లు! -మెదక్ మున్సిపల్ కమిషనర్‌పై భార్య ఫిర్యాదు - Wife Complaint Against Husband - WIFE COMPLAINT AGAINST HUSBAND
Wife Complaint Against Medak Municipal Commissioner : మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్‌పై ఆయన భార్య కళ్యాణి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానకిరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని భార్య కళ్యాణి పోలీసులకు తెలిపింది.
Published : Sep 30, 2024, 5:27 PM IST
|Updated : Sep 30, 2024, 6:58 PM IST
Wife Complaint Against Husband : మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్‌పై తన భార్య కళ్యాణి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానకిరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. భర్త పెళ్లి విషయం తెలుసుకున్న కళ్యాణి ఇవాళ అతన్ని నిలదీసింది. ఆమెను చంపుతానంటూ బలవంతంగా కారులో తీసుకొని వెళ్లడంతో కుటుంబసభ్యులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వారిని మధ్యలో అడ్డుకున్న పోలీసులు హబ్సీగూడ వద్ద జానకిరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్లో కళ్యాణి కేసు ఫైల్ చేసింది. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. దీంతో జానకిరామ్‌తో పాటు మరో అమ్మాయిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.