Widening of National Highway 44 NDA Government Planning For Anantapur Progress :అనంతపురంలో ప్రగతి పరుగులు పెట్టనుంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ముందడుగు వేశాయి. జాతీయ రహదారి-44ను విస్తరించాలని నిర్ణయించారు. నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు వేగంగా రూపొందిస్తున్నారు. అన్ని కుదిరితే త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ ఏడాదే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు రెండో మెట్రో నగరాల మధ్య పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
లాజిస్టిక్ హబ్‌లకు అవకాశం
హైదరాబాద్, బెంగళూరు మధ్య సరకు రవాణా కేంద్రాల అవసరం పెరిగింది. రెండు నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. సరకు రవాణా చేసే భారీ వాహనాలు నగరాల్లో ప్రవేశించాలంటే కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో నగర శివార్లలోనే దింపేసి అక్కడి నుంచి చిన్న వాహనాల ద్వారా తరలిస్తారు. దీనికోసం పెద్దఎత్తున లాజిస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో లాజిస్టిక్ హబ్‌కు కనీసం 50 నుంచి 60 ఎకరాల భూమి అవసరం.ఇప్పటికే అనంతపురం పరిధిలో 150 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. గుంతకల్లు, శింగనమల, అనంతపురం, రాప్తాడు, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల మీదుగా ఎన్‌హెచ్-44 వెళ్తోంది. రోడ్డును విస్తరిస్తే చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధర పెరగనుంది. ఆయా నియోజకవర్గాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం కానుంది. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా గతంలోనే టీడీపీ ప్రభుత్వం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు నెలకొల్పాలని సంకల్పించింది. ఈ ఐదేళ్లలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
కర్ణాటకలోని రామనగర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం కలిపి ఎన్‌హెచ్-67, బళ్లారి నుంచి ఏపీ మీదుగా తమిళనాడును కలిపి ఎన్‌హెచ్-42, కర్ణాటక నుంచి నంద్యాల మీదుగా విజయవాడను కలిపే ఎన్‌హెచ్-544డీ, ఎఫ్ వంటి రహదారులు ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్తూ ఎన్‌హెచ్-44తో అనుసంధానం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు రహదారుల విస్తరణ పనులను మొదలుపెట్టారు.
అమరావతి మహానగరికి ఓఆర్ఆర్ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project