Essential Skills to Get Tech Job :క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో విద్యార్థులకు ఎన్నో అపోహలు వస్తుంటాయి. అందులో ప్రధానంగా ఎక్కువ మార్కులు వచ్చిన వారికే అధిక ప్యాకేజీ వస్తుంది, ఇలా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయేమో, నాకు ఈ అర్హత లేదు కదా నన్ను ఎంపిక చేస్తారా? లేదా? ఇలా సవాలక్ష ప్రశ్నలు వారి మెదళ్లను తొలి చేస్తుంటాయి. నిజానికి ఉద్యోగాలకు కేవసం మార్కులే ప్రాతిపదిక కాదంటున్నారు ఉద్యోగ నిపుణులు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు హెచ్ఆర్ నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఈ స్టోరీలో చూద్దాం.
కరోనా తర్వాత ఇంటర్వ్యూల్లో చాలా మార్పులే వచ్చాయి. అంతకుముందు ఇంటర్వ్యూలను కంపెనీలో లేదా కాలేజీలో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. వాటి అనుసారంగా ప్రిపేర్ అవ్వాలి అంటున్నారు. చాలా మందికి సబ్జెక్టుపై అవగాహన ఉన్నా, అది ప్రాక్టికల్‌గా చేయలేరు. అలాంటి వారు ప్రాక్టికల్‌గా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంటున్నారు.
- టెక్ జాబ్స్ అయితే ఆయా పోస్టులకు కోడింగ్ చాలా అవసరం. దానితో పాటు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అలాగే చదువుకున్న సబ్జెక్ట్‌పై అవగాహన తప్పక ఉండాలి. టీమ్‌తో కలిసి పని చేయడానికి కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యం.
- ప్రాంగణ ఎంపికల్లో సెలక్ట్ అవ్వాలంటే మంచి మార్కులు అవసరమే కానీ, కేవలం మార్కులుంటేనే సరిపోదు. కంపెనీలు అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచే విద్యార్థుల పట్లనే ఆసక్తి చూపిస్తాయి.
- మంచి కమ్యూనికేషన్, ప్లాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రాక్టికల్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల వంటివి ఉంటే కచ్చితంగా ఇతరుల కంటే మన అవకాశాలను మెరుగుపరుస్తాయి.