Heavy Rain Alert To Andhra Pradesh :బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారంలోగ అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అనంతరం రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి, పశ్చిమ - వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీలో దంచికొట్టనున్న వానలు - RAIN ALERT TO ANDHRA PRADESH
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం - ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు
Published : Dec 16, 2024, 3:13 PM IST
మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, బుధవారం రోజున నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, పశ్చిమగొదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం తమిళనాడు, గురు, శుక్ర వారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్య్సకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.