Wealth Creation From Solid Waste Management Plant in Visakha: చెత్త నుంచి సంపద సృష్టిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఈ ఆలోచనను అమల్లోకి తీసుకురాగా విశాఖ కాపులుప్పాడ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి వెయ్యి టన్నుల చెత్తను మండించి తద్వారా 15 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇతర దేశాల్లో కనీసం ఒక్క శాతం దుర్వాసన లేని విధానం ఉంది. రాష్ట్రంలోనూ అదే తరహా విధానం అమలు చేయడానికి నూతన సాంకేతికతను అందిపుచ్చుకొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుంది: మంత్రి నారాయణ - Credai South Con 2024
విశాఖలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని ప్లాంటు నుంచి దుర్వాసన రాకుండా పటిష్ట చర్యలు చేపడతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విదేశాల్లో భారీ భవనాల మధ్య ప్లాంటులున్నా ఇబ్బందులు లేవని కాపులుప్పాడ నుంచి మాత్రం దుర్వాసన ఎందుకు వస్తుందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. విదేశాల్లో చెత్త నిల్వ ఉంచే ప్రదేశాలు పూర్తిగా గాజు గదుల మధ్య ఉంచుతారని, అందువల్ల వాసన బయటకు రాదని నిర్వాహకులు చెప్పారు. వాటి కోసం ప్రభుత్వం నుంచి అవసరమైన సాయాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక ఆధారంగా గాజు గదులు ఏర్పాటుపై ఆలోచించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంత్రిని కోరారు. వీలైనంత త్వరగా కాపులుప్పాడ ప్లాంటు నుంచి దుర్వాసన రాకుండా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.