Minister Lokesh Interaction with Students : 'నేను ముఖ్యమంత్రిని కాదు మంత్రిని' అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యాలు నవ్వుల పువ్వులు పూయించాయి. 'ముఖ్యమంత్రిని చేసి ఉన్న మంత్రి పదవిని కూడా ఉడించేలా ఉన్నావ్' అంటూ విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనీయర్ కళాశాలలో ఓ విద్యార్థితో మంత్రి లోకేశ్ సరదా వ్యాఖ్యాలు చేశారు. మధ్యహ్న భోజనం పథకం ప్రారంభోత్సవంలో భాగంగా నిన్న ముఖాముఖిలో భాగంగా ఓ విద్యార్థి లోకేశ్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించగా లోకేశ్ ఈ విధంగా ఛలోక్తి విసిరారు.
ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు : ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం లోకేశ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఏపీలో ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్లిపోతున్నారని దీనిపై ప్రభుత్వ చర్యలేంటని ఓ విద్యార్థి అడగగా అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని లోకేశ్ సమాధానమిచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగం దొరికేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
కొన్ని గంటల్లోనే పని పూర్తి : ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాని తెలిపారు. కళాశాలకు ప్రహరీ లేకపోవడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని మరొకరు చెప్పగా వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రహరీ, రంగులు, చిన్న చిన్న మరమ్మతులు అన్నీ చేపడతామన్నారు. కళాశాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఓ విద్యార్థిని కోరగా వెంటనే మంత్రి స్పందించి అధికారులను ఆదేశించారు. కార్యక్రమం ముగిసి మంత్రి వెళ్లిన కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.
'విద్యార్థులు ధైర్యంతో ముందడుగు వేయాలి' - మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన లోకేశ్
'పంట కోతకొచ్చింది ఆగండి' - ఎక్స్ ద్వారా లోకేశ్ దృష్టికి - ఆ తర్వాత ఏమైందంటే