అడుగంటిన బోర్లు, ఎండుతున్న పైర్లు - ఎండల తాకిడికే నెర్రెలు వారుతున్న భూతల్లి Water scarcity for Crops in Narayanpet : నారాయణపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులు అత్యధిక శాతం బోరు బావులపై ఆధారపడతారు. జిల్లాలో గత యాసంగిలో లక్షా 42 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ యాసంగిలో లక్షా 14 వేల ఎకరాలకు పడిపోయింది. అధికారుల లెక్కల ప్రకారం దాదాపుగా 30 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు తగ్గింది.
ఈ ఏడాది వర్షాలు అంతగా కురవకపోవడంతో సాగు తగ్గించినట్లుగా రైతులు చెబుతున్నారు. ధన్వాడలో మండలంలో గత యాసంగిలో 9,287 ఎకరాలలో సాగు చేయగా ఈసారి 8398 ఎకరాలు సాగు చేశారు. నారాయణపేటలో గత యసంగిలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ప్రస్తుతం 7731 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఇలాగే మద్దూరు, మాగానుర్, క్రిష్ణ, మక్తల్ తదితర మండలాల్లో వరి పంట సాగు తగ్గింది.
'ఏటా మొత్తం 10 ఎకరాల్లో వరి వేస్తాను. ఉన్న బోరులో నీరు లేక వరి పైరు ఎండిపోయింది. వరి పంట ఎండి పోవడంతో పశువులకు మేతగా వేస్తున్నా. గత 30 ఏళ్లలో దాదాపుగా 32 బోర్లు వేశా. ప్రస్తుతం బోరు నుంచి నీరు రావడం లేదు. ఒక బోరు 500 ఫీట్ల లోతు వేసినా చుక్క నీరు రాలేదు.'-రైతులు
Ground Water Reduced in Telangana : జిల్లాలో సంవృద్ధిగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగిన సమయంలో రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకున్నారు. ఈ వర్షా కాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చాలా మంది గత యాసంగి కంటే తక్కువ విస్తీర్ణంలో వరి వేశారు. వేసిన పంటకు బోర్ల ద్వారా నీటిని అందించాలనుకున్నారు. కానీ, క్రమంగా బోర్లలో నీటిశాతం తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. పంటను బతికించుకోవాలని 400 నుంచి 500 అడుగుల లోతులో బోర్లను వేసినా చుక్క నీరు రావడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటసాగు కోసం చేసిన పెట్టుబడితో అప్పులపాలయ్యామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
'నాకు ఏడు ఎకరాల పొలం ఉండగా ఎకరా భూమిలో వరి వేశాను. ఉన్న ఒక బోరులో నీరు అడుగంటి పోయింది. ఒకటి 400 అడుగులు, మరో బోరు 200 అడుగుల లోతు వేసినా నీరు రాలేదు. బోర్లు వేసేందుకు రూ. 78 వేలు ఖర్చు అయ్యాయి. ఎండిన వరి పంటను బర్రెలకు మేతగా వేస్తున్నాను.'- రైతులు
నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు - 'రైతు నేస్తం' పేరిట ఆన్‌లైన్ శిక్షణలు
ఆలోచనకు పదునుపెట్టి - వర్షపు నీటిని ఒడిసిపట్టి - బీడుభూములను సాగుభూములుగా మల్చుకున్న రైతులు