seapages in Annaram Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో సీపేజీలు కలవరపెడుతున్నాయి. మళ్లీ డ్యాం దిగువన నీటిబుంగలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు దిద్ధుబాటు చర్యలు చేపట్టారు. మరమ్మతుల కోసం బ్యారేజీలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గతంలో అన్నారం బ్యారేజీలో సీపేజీ, బుంగలు, లీకేజీ సమస్యలు రావడంతో, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ అదే సమస్య ఉత్పన్నం కావడంతో బ్యారేజీలోని నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం బ్యారేజీలో నిల్వ ఉన్న రెండు టీఎంసీలను 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
Annaram Saraswati Barrage Leakage :గతేడాది నవంబర్‌లో అన్నారం బ్యారేజీ 38, 28 పియర్‌ల వద్ద సీపేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పుడే అప్రమత్తమైన అధికారులు రాళ్లు, ఇసుక సంచులతో తాత్కాలిక మరమ్మతు చేసి లీకేజీని అదుపు చేశారు. బుంగల నుంచి ఇసుక బయటికి పోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్నారం బ్యారేజీని పరిశీలించిన మంత్రులు, ఇంజినీర్ల బృందం రెండు బుంగలతో ప్రమాదమేమి లేదని తేల్చారు.
నిర్మాణ సంస్థతో గ్రౌటింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆప్కాన్స్ సంస్థ ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి హెలికాప్టర్‌లో పాలియూరిథిన్ అనే కెమికల్ తెప్పించి, వంతెనలోని 38, 28 పియర్‌ల వద్ద బుంగలకు గ్రౌటింగ్ పనులను చేయించింది. రెండు పియర్స్ వద్ద ఏర్పడిన సీపేజీ మరమ్మతు పూర్తిచేసింది. కానీ మళ్లీ నీటిబుంగలు ప్రత్యక్షమవ్వడం నిర్మాణసంస్థను కలవరపెడుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి