ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట కోదండ రామాలయం - అంకురార్పణతో ప్రారంభం - KODANDA RAMA BRAHMOTSAVAMS - KODANDA RAMA BRAHMOTSAVAMS

Vontimitta Kodanda Rama Temple Brahmotsavam: శ్రీరామనవమి సందర్బంగా ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు పది రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని బహిరంగ ప్రదేశంలో లక్షమంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Vontimitta Kodanda Ramalayam
Vontimitta Kodanda Ramalayam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 10:48 AM IST

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట కోదండ రామాలయం- అంకురార్పణతో ప్రారంభం

Vontimitta Kodanda Rama Temple Brahmotsavam:రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి 26వ తేదీ వరకు పది రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని బహిరంగ ప్రదేశంలో లక్షమంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

భద్రాద్రి మిథిలా ప్రాంగణంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ రాత్రి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈనెల 26న పుష్పయాగంతో ముగుస్తాయి. ఈ నెల 17వ తేదీన ద్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితులు రాజేశ్ కుమార్ భట్టార్ సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 11వ శతాబ్ధంలో నిర్మించిన ఏకశిలానగరి ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి.

కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు

త్రేతాయుగంలో రామలక్ష్మణులు వనవాసం సందర్భంగా ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చినపుడు రుషుల యజ్ఞాలకు రాక్షసులు భంగం కల్గించేవారు. రాక్షసులను సంహరించి రుషుల యజ్ఞాన్ని జయప్రదం చేసిన రామలక్ష్మణులు కోదండరాముడి అవతారంలో కనిపిస్తారని భక్తులు చెబుతుంటారు. ఆంజనేయస్వామి శ్రీరాముడికి పరిచయం కాకముందే ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించారనేది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించదు.

నేటి నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. ఏప్రిల్​ 5న సీతారాముల కల్యాణ మహోత్సవం

రాష్ట్ర విభజన తర్వాత 2015లో ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2015లో దేవాదాయశాఖ బహిరంగ ప్రదేశంలో సీతారాముల కల్యాణం నిర్వహించగా 2016 నుంచి ఆ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. 2016 నుంచి ఇప్పటివరకు టీటీడీ ప్రతి సంవత్సరం ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజు రాత్రి స్వామివారి కల్యాణం జరుగుతుంది.

సుమారు 52 వేల మంది ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణ ఘట్టాలను తిలకించడానికి వేదిక సిద్ధం చేశారు. సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ మహోత్సవానికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో 2 లక్షల ప్యాకెట్ల ముత్యాల తలంబ్రాలను టీటీడీ సిద్ధం చేస్తోంది. తీర్థప్రసాదాలు, మంచినీటి వసతి కల్పించనున్నారు. పోలీసులు భారీగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

కన్నుల పండువగా.. ఒంటిమిట్ట కోదండరామస్వామి రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details