Volunteer Cheating Poor People in Nellore District : 'నేను వాలంటీరుగా పని చేస్తూ పొలం కొన్నాను, సొంత ఇల్లు కూడా ఉంది. వ్యాపారం చేయడానికి కాస్తా డబ్బు అప్పుగా ఇవ్వండి' అంటూ చిరు వ్యాపారుల నుంచి గుడి వద్ద అడుక్కునే వృద్ధురాలి వరకు అందరి వద్ద అప్పు చేసింది. వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తూ చుట్టు పక్కల వారితో మాటలు కలిపి అందరిని నమ్మించింది. కొంతకాలం వరకు తీసుకున్న డబ్బులకు వడ్డీలు కూడా కట్టింది. తాను మోసం చేయదని నమ్మిన వాళ్లు తమ డబ్బుతో పాటు స్నేహితులతో కూడా అప్పు ఇప్పించారు. చివరికి అందరికి మోసం చేసి కుటుంబ సభ్యులతో సహా పరారయ్యారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.
ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud
నెల్లూరు నగరంలో వాలంటీరుగా పనిచేస్తున్న మోదేపల్లి హేమలత సుమారు 30 మందిని మోసం చేసి కుటుంబంతో సహా పరారయ్యారు. ఆమె అందరితో మంచిగా ఉంటూ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద వడ్డీలకు నగదు తీసుకున్నారు. చీటీలు వేసి వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. సొంతిల్లు ఉండటంతో నిజమేనని అనేక మంది ఆమె మాటలు నమ్మారు. సుమారు 30 మంది వద్ద రూ.60 లక్షలకు పైగా డబ్బులు తీసుకున్నారు.