Rajya Sabha by election : రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ అవుతున్న 3 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. మూడింట్లో ఒకటి టీడీపీకి, మరొకటి బీజేపీకి ఖరారు కాగా, మూడో సీటు సైతం టీడీపీకి దక్కనుంది. వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు మళ్లీ పోటీకి దిగనుండగా బీద మస్తాన్‌రావు టీడీపీ నుంచి, కృష్ణయ్య బీజేపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. మోపిదేవి స్థానాన్ని కొత్తవారికి కేటాయించనున్నారు. మూడో సీటు కూడా టీడీపీ ఖాతాలోకి రానున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఆశావహులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో కంభంపాటి రామ్మోహన్‌రావు, భాష్యం రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్, కృష్ణయ్య పదవీకాలం 2026 జూన్ వరకు ఉన్నాయి.
టీడీపీ గూటికి మోపిదేవి, బీదా మస్తాన్‌రావు - సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు