ETV Bharat / state

వారిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దు - సీఐడీ అఫిడవిట్ - MUMBAI ACTRESS CASE UPDATES

ముంబై నటి వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం - కాంతిరాణా, విశాల్ గున్నీకి బెయిల్ ఇవ్వవద్దని అఫిడవిట్ వేసిన సీఐడీ

CID Affidavit on Mumbai Actress Case
CID Affidavit on Mumbai Actress Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 10:35 PM IST

CID Affidavit on Mumbai Actress Case : ముంబై నటి వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నీకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టులో సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే కేసులో కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, పోలీసులు, న్యాయవాది ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్​లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ అఫిడవిట్​లో పేర్కొంది. ముంబై నటినీ అక్రమంగా అరెస్ట్ చేశారని సీఐడీ అఫిడవిట్​లో స్పష్టం చేసింది.

నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలు మేరకు ఇదంతా జరిగిందని తెలిపింది. ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారని అఫిడివిట్​లో వెల్లడించింది. వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందని సీఐడీ అఫిడవిట్​లో తెలిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - Mumbai Actress Case

కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్​లో కీలక అంశాలు - నిందితుల్లో పలువురు ఐపీఎస్‌లు - Kadambari Jethwani Case Updates

పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు - ముంబయి నటి వాంగ్మూలంలో కీలక విషయాలు - MUMBAI ACTRESS CASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.