Fengal Cyclone Alert Minister Atchannaidu orders : ఫెయింజల్ తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుపాను కారణంగా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. తుపాను తీవ్రత, తాజా పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో తుపాను తీవ్రత తగ్గిన వెంటనే చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు రైతులకు తెలియచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులు ఎవరూ సెలవు పెట్టకుండా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు.
పుదుచ్చేరి-మహాబలిపురం దగ్గర తీరాన్ని తాకిన తుపాను - ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక
రైతులను వణికిస్తున్న ఫెయింజల్ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్