Vizag Rushikonda Palace :ఏపీలో ఎన్నికలు పేదోడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని మాటలతో కలరింగ్ ఇచ్చిన జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో రుషికొండకు బోడిగుండు కొట్టి నిర్మించిన భవనాలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. రుషికొండ మీద రూ.500 కోట్లతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లో ఫర్నిచర్, అడుగు అడుగున బంగారు తొడుగులు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
ఇక రూ.26 లక్షల విలువచేసే బాత్ టబ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది.' అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు' అంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వెతికే కొద్దీ ఇటువంటి ప్రజల సొమ్ము తో వృధా చేసిన ఘోరాలు దారుణాలు ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో అని సామాన్య జనం చర్చించుకుంటున్నారు.
పచ్చదనంతో కళకళలాడే రుషికొండను బోడి కొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్ సినిమాలోని మైసభను తలపిచేలా పెద్దపెద్ద గదులు, హాల్స్, ఫన్నీచర్‌తో నింపేశారు. అనుమతులు లేకపోయినా.. జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్ మార్చేశారు. తీరా ఇప్పుడు అధికారం మారిపోవడంతో ఆ భవానాల గుట్టు బయటపడింది. ఏడు బ్లాక్‌లుగా భవనాలు నిర్మించగా కళింగ బ్లాక్‌లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చొనే కంట్రోల్ రూం, 175 మంది కూర్చొనే సభ మందిరం నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్‌తో కోట్లు కుమ్మరించి నిర్మించారు.
విశాఖలో వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల శ్రేణులతో కలిసి పరిశీలించారు. రూ.450 కోట్లు కుమ్మరించి ఈ భవనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేదు. దీంతో ఇదేమైనా "రాజకోట రహస్యమా" అని విమర్శలు వినిపించాయి.