ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో 728 తుపాకులు స్వాధీనం- ఎన్నికల ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: సీపీ - Vizag CP Ravi Shankar - VIZAG CP RAVI SHANKAR

Vizag Police Commissioner Ravi Shankar: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై వివరాలను విశాఖ నగర సీపీ వెల్లడించారు. ఎన్నికల్లో అక్రమాలపై సి-విజిల్, సువిధకు, డయల్ 100,122కు ఫిర్యాదు చేయాలని సుచించారు. విశాఖలో మెుత్తం 728 మంది వద్ద తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2092 మంది రౌడి షీటర్లు ఉన్నట్లు వెల్లడించారు.

Vizag CP Ravi Shankar
Vizag CP Ravi Shankar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 8:48 PM IST

Vizag Police Commissioner Ravi Shankar:ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో తుపాకులు

అత్మరక్షణ కోసం తుపాకులు అనుమతులు కలిగి ఉన్న 728 మంది వ్యక్తుల వద్ద నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. జిల్లాలో మెుత్తం 2092 మంది రౌడి షీటర్లు ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యుదులపై స్పందించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వాహణ సజావుగా సాగాడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ రవిశంకర్ హెచ్చరించారు.

తుపాకులు కలిగి ఉన్నావారి వివరాలు: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, విశాఖలో ఎన్నికల నిర్వాహణపై సీపీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియామావలి ప్రకారం నేర చరిత్ర, తుపాకులు కలిగి ఉన్నావారి వివరాలు విశాఖ సీపీ రవిశంకర్ (CP Ravi Shankar) మీడియాకు తెలిపారు. విశాఖ నగరంలో ఆత్మ రక్షణ కోసం వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల వద్ద పూర్తి అనుమతులు కలిగిన 728 తుపాకులు ఉన్నట్లు తెలిపారు. ఇక నిరంతర నేరాలు చేస్తూ, పలు పోలీసు కేసులో ఇరుక్కున్న రౌడి షీటర్లు 2092 మంది ఉన్నారన్నారు.

నిరంతరం పనిచేస్తున్న మూడు టీంలు: ఎన్నికలు సజావుగా సాగడానికి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారిని ఆధీనంలో తీసుకున్నట్లు తెలిపారు. అనుమతితో కూడిన ఆయుదాలను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో ఎన్నికల నియామావళి (Model Code of Conduct) పరిశీలనకు మూడు టీంలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయని సీపీ వెల్లడించారు. విశాఖలో ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే సి-విజిల్, సువిధకు, డయల్ 100, 122కు ఫిర్యాదు చేయాలని సీపీ రవిశంకర్ సూచించారు.

అనుమతి లేకుండా ఇంటింటి ప్రచారం: అక్రమాలపై ఫిర్యాదు వస్తే, 100 నిమిషాలలోపు సంబంధిత అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసిట్లు సీపీ వెల్లడించారు. ఏంసీసీ టీమ్, ఎంపీడీఓ అధీనంలో పనిచేస్తుందని తెలిపారు. కొందరు వ్యక్తులు, రాజకీయ నాయకులు అనుమతి లేకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే విశాఖకు మూడు బెట్టాలియన్ల సీఆర్పిఎఫ్ బలగాలు చేరుకున్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. అంతే కాకుండా అవసరమైన చోట ఉపయోగించడానికి పోలీస్ వాహనాలు సిద్దం చేసుకుంటున్నట్టు చెప్పారు. విశాఖలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ (IPL Cricket Match) కోసం అనుమతి ఉందని సీపీ స్పష్టం చేశారు.

విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్. రవిశంకర్ అయ్యనార్

ABOUT THE AUTHOR

...view details