Visakhapatnam Waltair DRM Taking Bribe of Rs 25 Lakhs : విశాఖపట్నం వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ (DRM) సౌరభ్‌ప్రసాద్ రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు లంచం ఇచ్చిన ముంబయికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి, పుణెకు చెందిన మరో ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో డీఆర్‌ఎం వద్ద రూ.87.6 లక్షల డబ్బుతో పాటు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ తాళాలు, బ్యాంకు ఖాతాలను అధికారులు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలోని డీఆర్‌ఎం బంగ్లాతో పాటు మరికొన్ని చోట్ల చేసిన సోదాల్లో వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఎంతో పాటు ప్రైవేటు సంస్థల ప్రతినిధులపై నేరపూరిత కుట్ర, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు సీబీఐ తెలిపింది.
'నా భార్య రోజూ లక్షల్లో లంచం డబ్బు తెస్తుంది - మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే'