NITI Aayog Growth Hub Project in Visakhapatnam :'వికసిత్ భారత్ (Viksit Bharat 2047)' లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకొని 'నీతి ఆయోగ్ (NITI Aayog)' ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి అయింది. దేశంలో మొత్తం 20 నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా 4 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకీ చోటు కల్పించారు. ముంబయి, సూరత్, వారణాసి మిగిలిన మూడు. వాటి అభివద్ధికి ప్రణాళికల ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కాగా విశాఖపట్నం నగరానిది తయారవుతోంది. ఏ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించొచ్చు, అందుకు ఉన్న అవకాశాల వంటివి పరిశీలిస్తున్నారు.
11 రకాల అభివృద్ధి సూచికలు :ఆయా ప్రాంతాల్లోని వనరుల ఆధారంగా ఆర్థిక ప్రణాళికకు ఇప్పటికే 11 రకాల అభివృద్ధి సూచికలను గుర్తించారు. వాటి ఆధారంగా కసరత్తు చేసి ఆర్థిక ప్రగతికి బాటలు వేయనున్నారు. ఇందుకోసం విశాఖపట్నంలో నీతి ఆయోగ్ 2 దఫాలు పలు జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులు, అనుబంధ రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఏయే అంశాలపై దృష్టి సారించాలి, ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో అధికారులకు మార్గనిర్దేశం చేసింది.
విశాఖపట్నం హబ్ పరిధిలోకి వచ్చే జిల్లాలు :విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ.
దిల్లీ, ముంబయి నగరాల స్థూల జాతీయోత్పత్తి (GDP) కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. దేశంలోని మిగిలిన ప్రాంతాల జీడీపీని ఆ స్థాయికి తీసుకువచ్చేలా ఆర్థిక ప్రణాళికలను నీతి ఆయోగ్ చేస్తుంది.
ఆ నాలుగు నగరాలు