ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిగొచ్చిన యాజమాన్యం - విశాఖ స్టీల్‌ప్లాంట్ ఒప్పంద కార్మికుల సమస్య పరిష్కారం - Steel Plant Contract Workers Issue - STEEL PLANT CONTRACT WORKERS ISSUE

Visakha Steel Plant Contract Workers Issue Resolved : గత రెండు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్​ను కుదిపేసిన కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వివాదం సుఖాంతమైంది. ఈమేరకు విశాఖ ప్రాంతీయ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం, కార్మిక ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించడంతో సమస్యకు పరిష్కారం లభించినట్టయింది.

steel_plant_contract_workers_issue
steel_plant_contract_workers_issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 9:26 PM IST

Visakha Steel Plant Contract Workers Issue Resolved :విశాఖ స్టీల్‌ప్లాంట్ ఒప్పంద కార్మికుల సమస్యకు తెరపడింది. ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు ఇటీవల ఆందోళ బాటపట్టారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని భావించిన యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రాంతీయ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

సెప్టెంబర్ 27న విశాఖ స్టీల్ ప్లాంట్​లో 4200 కార్మికుల ఎంట్రీ పాసులను నిలుపుదల చేసింది. ఈనెల 29న కొత్త గేట్ పాస్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఆన్​లైన్​లో వారి ఎంట్రీపాసులను తీసివేయడంతో ప్లాంట్ లోపలికి సీఐఎస్​ఎఫ్ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. వారి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఒప్పంద కార్మికులు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి కార్యాలయ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. తక్షణమే సీఐఎస్ఎఫ్, స్ధానిక పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి పరిస్దితి చేజారకుండా చర్యలు చేపట్టింది. వారిని అక్కడే నిరసన చేసేందుకు అనుమతించింది. సమస్యకు పరిష్కారం లభించే వరకు తామిక్కడే ఉంటామని కార్మికులు భీష్మించడంతో రాత్రంతా దాదాపు అదే భవనం వద్ద వారంతా ఉండిపోయారు. ఈ ఉదయం కూడా కూర్మన్నపాలెం కూడలి వద్ద వారు నిరసనకు దిగడం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళనకు దిగి కార్మికులకు మద్దతు పలకడం తీవ్రతకు అద్దంపట్టాయి.

ఇదే సమయంలో జరిగిన చర్చలు సాయంత్రానికి సమస్యకు పరిష్కారం లభించడంతో కార్మికులకు ఊరట లభించనట్టయింది. ఈ క్రమంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గేట్ పాస్ విధానాన్ని కొనిసాగిస్తామని యాజమాన్యం అంగీకరించింది. 7 రోజుల్లోగా ఆన్​లైన్ గేట్ పాస్ విధానాన్ని పునరుద్దరించడానికి, లేబర్ చట్టాలను అమలు చేయడానికి కూడా అంగీకారం కుదిరింది. ఇందులో సీఐటీయు, ఐఎన్​టీయుసీ, హెచ్ఎంఎస్, ఎఐటీయుసీ, టీఎన్​టీయుసీ, వంటి ప్రధాన యూనియన్ల ప్రతినిధులు, ప్రాంతీయ కమిషనర్ కేజే మహంతి సమక్షంలో ఉక్కు యాజమాన్య ప్రతినిధులు సంతకాలు చేశారు.

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్ - వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ - TTD Darshan Through WhatsApp

చిక్కులు తొలగితే విలీనానికి మార్గం సుగమం - విశాఖ ఉక్కుపై సర్వత్రా ఆసక్తి - Visakha Steel Merger with SAIL

ABOUT THE AUTHOR

...view details