Visakha Airport Police Seized Fake Currency Notes:మూడు కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను విశాఖ ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ మోకా సత్తిబాబు వెల్లడించారు. వెస్ట్ ఏసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పద్మావతి నగర్ గోశాల ప్రాంతానికి చెందిన కోసుంపూరి వెంకట కనక దుర్గరాజుకు కాకినాడ జిల్లా అన్నవరంలో కొన్ని రోజుల క్రితం గనిరాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన వద్ద నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిని ఒక లిక్విడ్ ద్వారా ఒరిజినల్ నోట్లుగా తయారు చేయవచ్చునని అతను తెలిపాడు. ఆ విషయాన్ని మొదట్లో పట్టించుకోకపోయినప్పటికీ, తర్వాత అది నిజమో కాదోనని తెలుసుకోవడానికి దుర్గరాజు ఒకరోజు గనిరాజు వద్దకు వెళ్లాడు.
కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే.. నిజంగానే చెల్లవా..?
Police Arrest Two Persons:అతడు తన వద్ద ఉన్న నల్లని రెండు రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను లిక్విడ్‌లో పెట్టి ఒరిజినల్ నోటుగా తయారు చేశాడు. ఆపై ఆ నోటుతో ఒక దుకాణం వద్దకు వెళ్లి సిగరెట్లను కొనుగోలు చేశారు. దీంతో ఆ నోట్లు చెల్లుబాటు కావడంతో వీరికి నమ్మకం కుదిరింది. దీంతో తనకు నోట్లు కావాలంటూ భాస్కర్‌రాజు అడగ్గా, రూ.30 లక్షలు ఇస్తే మూడు కోట్లకు సంబంధించిన నల్లని నకిలీ నోట్లను ఇస్తానని గనిరాజు చెప్పాడు. దీంతో రెండు రోజుల క్రితం భాస్కర్‌రాజు, గనిరాజుకు నగదు ఇచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి గ్రామం క్షత్రియ వారి వీధికి చెందిన మద్దాల శ్రీనివాస్‌తో కలసి నకిలీ కరెన్సీని తీసుకొని విశాఖకు కారులో బయల్దేరాడు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి విశాఖ నగరం కాకానినగర్ వద్ద కారుని ఆపి తనిఖీలు చేశారు. మూడు లగేజీ బ్యాగుల్లో రూ.3 కోట్లకు సంబంధించిన నకిలీ కరెన్సీ నోట్లతో పాటు రూ.50 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, హోండా సిటీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.