Village Doctors Dharna :పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ పల్లె దవాఖానా వైద్యులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన వైద్యులు కోఠిలోని కమిషనర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్యం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది డాక్టర్లు పల్లె దవాఖానాలలో పనిచేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ఎంపీ వ్యవస్థను నిర్మూలించేందుకు పల్లె దవాఖానాలలో డాక్టర్లుగా (Docters) తమను నియమించారని పేర్కొన్నారు. గ్రామాలలో అనేక కష్టాలు పడుతూ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వైద్యుల సస్పెన్షన్‌పై నల్ల బ్యాడ్జీలతో డాక్టర్స్ నిరసన
"పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని మేం ఆందోళనకు దిగాం. నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది వైద్యులు పల్లె దవాఖానాలో పని చేస్తున్నాం. గత ప్రభుత్వం ఆర్ఎంపీ వ్యవస్థను నిర్మూలించేందుకు పల్లె దవాఖానాలో డాక్టర్లుగా తమను నియమించింది. గ్రామాలలో అనేక కష్టాలు పడుతూ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇరు ప్రభుత్వాలు తమకు జీతాలు చెల్లిస్తున్నారు."-ప్రభుత్వ పల్లె దవాఖానా వైద్యులు