Vijayawada CP about Attack on CM Jagan: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుల వివరాలు చెబితే పారితోషికం ఇస్తామని విజయవాడ సీపీ కాంతిరాణా పత్రికా ప్రకటనలో తెలిపారు. నిందితుల వివరాలు, ఫొటోలు, వీడియోలు ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల నగదు పారితోషకం ఇస్తామన్నారు. విలువైన సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ హామీ ఇచ్చారు. కంచి శ్రీనివాసరావు డీసీపీ 9490619342, శ్రీహరిబాబు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ 9440627089 లకు వాట్సప్ ద్వారా కానీ, ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.
సీఎంపై రాయి దాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరిస్తున్నారు. స్థానికులను విచారణ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాలను వీడియో చిత్రీకరణ చేశారు.
సీఎం దాడి ఘటనలో సుస్పష్టంగా భద్రతా వైఫల్యం- లోపభూయిష్ఠంగా సిబ్బంది తీరు - Security Failure in Jagan Incident
సెల్ ఫోన్ డేటాను డంప్ చేసి విశ్లేషణ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలను తెప్పించి, వాటిని వడపోసే పనిలో ఉన్నారు. అనుమానాస్పదంగా ఉండే కాల్స్, ఒకే నంబరు నుంచి ఎక్కువసార్లు వెళ్లిన ఫోన్లపై దృష్టి పెట్టారు. ఇద్దరు, ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశం సైతం ఉండవచ్చనే కోణంలో పరిశీలిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా ఆపేయడంతో దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. ఘటనా స్థలికి పక్కనే ఉన్న ప్రైవేటు స్కూల్ వైపు నుంచి వచ్చిన రాయి తొలుత సీఎం జగన్‌కు, తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లికి తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఆ స్కూల్లోకి ఆగంతకులు వెళ్లి ఉంటారనే అనుమానంతో పోలీసులు పాఠశాలకు చెందిన సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
జగన్‌పై దాడిలో విసిరినది రాయా లేక ఎయిర్‌గన్ ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. పక్షులను కొట్టే క్యాట్‌బాల్‌ను వాడారా అన్నదానిపై సైతం దర్యాప్తు చేస్తున్నారు. లేదా ఎయిర్‌గన్ వినియోగించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘటన జరిగిన తీరును సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేశారు. సీఎం ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయి ఎటు నుంచి వచ్చి తగిలింది, ఆ సమయంలో నిందితులు ఎక్కడ దాగి ఉండొచ్చు అన్న అంశాలను పరిశీలించారు. తాజాగా నిందితుల వివరాలు చెబితే పారితోషకం ఇస్తామని విజయవాడ సీపీ కాంతిరాణా ప్రకటించారు.
సీఎం జగన్ మీద రాయి విసిరిన ఘటనపై సిట్ ఏర్పాటు - వేగంగా దర్యాప్తు - Attack on CM Jagan