తెలంగాణ

telangana

ETV Bharat / state

టీటీడీ అన్న ప్రసాదంలో ఫేమస్ వంటకం - సోమవారం నుంచి ప్రారంభించిన అధికారులు - MASALA VADAS IN TTD ANNA PRASAD

వెంగమాండ అన్నప్రసాద కేంద్రంలో మెనూలో మసాల వడ - సోమవారం నుంచి ప్రారంభించిన టీటీడీ

TTD Added Masala Vadas in Anna Prasad
TTD Added Masala Vadas in Anna Prasad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 12:00 PM IST

TTD Added Masala Vadas in Anna Prasad : టీటీడీ ధర్మ కర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాండ అన్న ప్రసాద కేంద్రంలో మెనూలో మసాల వడను చేర్చారు. సోమవారం నుంచి భక్తులకు దీన్ని వడ్డించడం ప్రారంభించారు. మొదటి రోజు 5 వేల వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు. మరో వారం రోజుల పాటు పరిశీలించి, తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని సమాచారం. పలువురు భక్తులు అన్న ప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ - మంగళవారం బ్రేక్​ దర్శనాలు రద్దు!

సాధారణంగా ఉన్న భక్తుల సంఖ్య : ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 6.83 లక్షల మందికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. హుండీ ఆదాయం రూ.34.43 కోట్లు కాగా, 1,13,132 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని రెండు షెడ్లలో వేచి ఉన్నారు. వీరందరికీ శ్రీవారి దర్శనం 15 గంటల్లో లభించనుందని టీటీడీ తెలిపింది.

నేడే శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల - ఇలా బుక్ చేసుకోండి

పది రోజుల పాటు తెరిచే ఉండనున్న వైకుంఠ ద్వారాలు - లక్షా 20 వేల టోకెన్ల జారీ

ABOUT THE AUTHOR

...view details