Vasireddy Padma Complaint on YSRCP Ex MP Gorantla Madhav : అత్యాచార బాధితుల పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రేప్ బాధితుల వివరాలు గోరంట్ల మాధవ్ బహిర్గతం చేయటంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులను పట్ల దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరామన్నారు.
గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వాళ్ల పార్టీకి చెందిన వార్తా ఛానెల్ ప్రసారం చేయటాన్ని కూడా ఫిర్యాదులో ప్రస్తావించామన్నారు. గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ వారికి కూడా ఫిర్యాదు చేశానని పద్మ పేర్కొన్నారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమని, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులు అని చెప్పారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారంలో రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని వాసిరెడ్డి పద్మ తెలిపారు.