ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం - వల్లభనేని వంశీ అరెస్టు తప్పదా? - TDP Office Attack Case Updates

Vallabhaneni Vamsi Will Arrest in TDP Office Attack Case: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చి పోలీసులు కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి. గత నెల 7న విజయవాడలోని నివాసానికి వచ్చినప్పటి నుంచి వంశీ ఎక్కడున్నారనే సమాచారం లేదు.

Vallabhaneni Vamsi Will Arrest in TDP Office Attack Case
Vallabhaneni Vamsi Will Arrest in TDP Office Attack Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 7:24 AM IST

Vallabhaneni Vamsi Will Arrest in Gannavaram TDP Office Attack Case:కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చి గన్నవరం కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గానికే రాలేదు.

గత నెల 7న విజయవాడలోని నివాసానికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పోలీసు, కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాయి. అప్పటి నుంచి వంశీ ఎక్కడున్నారనే సమాచారం లేదు. ఈ దాడి కేసులో సుమారు 70 మందికి పైగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - కీలక నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు - TDP Office Attack Case

అసలు ఏం జరిగిందంటే - గత సంవత్సరం ఫిబ్రవరి 19న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై అప్పటి స్థానిక ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించి కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. అంతకుముందు రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌పై ఎమ్మెల్యే వంశీ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వల్లభనేని వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో తమ నాయకుడినే విమర్శిస్తారా అంటూ వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి చేశారు. కార్యాలయంపై దాడి చేసిన రోజే టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వంశీ అనుచరులు అక్కడి నుంచి వెనుదిరిగారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో దాడికి పాల్పడ్డారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి - అప్పిరెడ్డి బెయిల్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా - HC on Lella Appireddy Petition

టీడీపీ కార్యాలయం వద్ద దాడి ఘటన నేపథ్యంలో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి ఇరువైపులా టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం మోహరించాయి. స్థానిక అప్సర థియేటర్‌ సమీపంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈక్రమంలో హైవేపై మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - మరో ముగ్గురు అరెస్ట్ - Attack on TDP Central Office

ABOUT THE AUTHOR

...view details