Unpaid Compensation For Municipal Workers Families: కరోనా సమయంలో వారే దేవుళ్లు. అప్పట్లో వారిపై పూల వర్షం కురిపించిన ప్రభుత్వం ఆ తర్వాత వారి కుటుంబాలను కన్నీరు పెట్టిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మృతి చెందిన పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన పరిహరం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. పొషించే వారిని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. తమకు పరిహరం ఇప్పించాలని అధికారులు చూట్టు తిరుగుతున్నా ఫలితం లేదని కన్నీరు పెడుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులు విధుల్లో చనిపోతే వారికి పరిహారం ఇవ్వకుండా అధికారులు ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులు విధుల్లో సాధారణ మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలి. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది అమలు కావడం లేదు.
చీరాల మున్సిపల్ సమావేశంలో వివాదం- బాయ్‌కాట్ చేసిన కౌన్సిలర్
బాధిత కుటుంబ సభ్యులు పరిహారం కోసం ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. పోషించే వారు దూరం కావడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని అవేదన చెందుతున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తూ గుడవల్లి యేసుకుమారి చనిపోయారు. పరిహరం కోసం ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా రుపాయి కూడా రాలేదని ఆమె భర్త నాంచారయ్య చెబుతున్నారు.