Unnecessary Check Dam Construction in Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని కోడిపుంజుల వాగులో ఇరిగేషన్ అధికారులు మూడు చెక్ డ్యాములను నిర్మించారు. వాగులో అవసరం లేకపోయినా వాటిని నిర్మించేసరికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం డి జనరేషన్ ఆఫ్ వాటర్ స్కీమ్ కింద 2020లో చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. నీటి ప్రవాహం ఉన్న వాగుల్లో చెక్ డ్యామ్‌లో నిర్మించి తద్వారా నీటి లెవెల్ పెంచెందుకు రైతులకు సాగునీరు ఉపయోగపడేందుకు వీటిని కట్టడం చేపట్టారని అధికారులు తెలిపారు.
Check dam shutters destroy : చెక్ డ్యాం షట్లర్లు ధ్వంసం చేశారు.. ఎందుకంటే..?
అయితే 15మీటర్ల వెడల్పు ఉన్న వాగుకు 70మీటర్ల చెక్ డ్యాములను నిర్మించారు. ఒక్కొక్క డ్యామ్ సూమారు రూ.2.50 కోట్లతో నిర్మించారు. కాగా కోడిపుంజుల వాగులో సుమారు 45 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు నిర్మిస్తే సరిపోయేది. కానీ ఎక్కువ వెడల్పుతో డ్యామ్ నిర్మించడం వల్ల సమీపంలో ఉన్న పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. ప్రాజెక్టు సరైన రీతిలో నిర్మించకపోవడం వల్ల వర్షాకాలంలో పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
"కోడిపుంజుల వాగు దగ్గర మూడు చెక్ డ్యాములు నిర్మించారు. వర్షాకాలంలో వరద నీరు వల్ల కోతకు గురవుతుంది. గైడ్‌వాల్స్ కడతామన్నారు కానీ కట్టడం లేదు. కమలాపురంలో నిర్మించాల్సిన డ్యామ్‌లు ఇక్కడ నిర్మించారు. అక్కడ అనవసరంగా డ్యామ్ ఇక్కడ నిర్మించారు. దీనిపై చాలాచోట్ల ఫిర్యాదు చేసినా అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కనీసం పంట నష్టం వచ్చినప్పుడు పరిహారం కూడా చెల్లించలేదు. గైడ్‌వాల్స్ కట్టాలని గత ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దానివల్ల పంటను నష్టపోతున్నాం."- బాధిత రైతులు