Universities VCs and Registrars Resigns in AP: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో స్వామి భక్తి చాటుకున్న ఉపకులపతులు, రిజిస్ట్రార్లు వంటి కీలక పదవుల్లో నియమితులైన కొందరు ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండటంతో వారు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విద్యానిపుణులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు విశ్వవిద్యాలయాల నుంచి అధికారులు తప్పుకుంటున్నారు.
కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య కూడా రాజీనామా చేశారు. చింతా సుధాకర్, వెంకటసుబ్బయ్య రాజీనామాను ఉన్నత విద్యామండలి ఆమోదించింది. వైఎస్సార్సీపీతో అంటకాగినట్లు చింతా సుధాకర్, వెంకటసుబ్బయ్యపై ఆరోపణలు వెలువెత్తాయి. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా వైవీయూ ప్రిన్సిపల్ రఘునాథ్‌రెడ్డికి అదనపు బాధ్యతలను విద్యామండలి అప్పగించింది. నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా రామచంద్రారెడ్డి చేరారు.
ఏయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా ఆచార్య కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరణ - AU New incharge registrar
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా జీవితం మొదలు పెట్టి ఇక్కడే అధ్యాపకునిగా చేరి ఇంఛ్ర్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు తీసుకోవడంపై కిషోర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీసీ ఛాంబర్‌ను, వర్సిటీని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారని, వైఎస్సార్సీపీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ గెలుపు కోసం పరిశోధకులను ఉపయోగించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో వీసీ తన పదవికి రాజీనామా చేశారు.