తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణిని అప్పులు పాలు చేసిన ఘనత కేసీఆర్​దే : కిషన్​రెడ్డి - singareni mines issue - SINGARENI MINES ISSUE

Kishan reddy on Singareni Mines : బీఆర్ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయజోక్యంతో, సింగరేణి సంస్థ తీవ్రంగా అప్పుల పాలయ్యిందని కేంద్రగనులశాఖ మంత్రి కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ఆయన స్ఫష్టం చేశారు.

Central Minister Kishan Reddy fires on KCR
Kishan reddy on Singareni Mines (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 5:07 PM IST

Updated : Jun 22, 2024, 6:50 PM IST

Central Minister Kishan Reddy fires on KCR :సింగరేణి సంస్ధపై బీఆర్ఎస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తోందని, కేంద్రగనుల శాఖమంత్రి కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్​కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను ఓటుబ్యాంక్​గా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా సింగరేణిని దోచుకుని ఆర్థిక విధ్వంసం చేశారని మండిపడ్డారు.

తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించిన ప్రజలందరికి ధన్యవాదాలు : కిషన్​రెడ్డి - Salute Telangana bjp Rally

సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు చాలా ప్రధానమైనదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం జరుగుతోందని వెల్లడించారు.

సింగరేణి వ్యవస్థను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. 2014లో సింగరేణి అకౌంట్​లో 3 వేల 500 కోట్ల రూపాయల నిధులున్నాయని, నేడు సంస్థను అప్పులపాలు చేసి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేధన వ్యక్తం చేశారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించలేదన్నారు.

సింగరేణిని అభివృద్ధి కోణంలో ఏ రోజు కేసీఆర్ చూడలేదని చెప్పారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే నిధులలో ఒక్క పైసా కూడా కేంద్రం తీసుకోదని, సింగరేణి కార్మికులకు హామీ ఇస్తున్నానని, అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు. సింగరేణినీ కేసీఆర్, కేటీఆర్ ఎన్నికలలో ఉపయోగించుకున్నారు తప్ప, కార్మికుల కోసం ఏం చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 రౌండ్ల బొగ్గు గనులను వేలం వేశారని, ఇందులో రూ. 37వేల కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో ఒక రూపాయి కూడా కేంద్రానికి రాదని, 14 శాతం రాయల్టీ రాష్ట్రప్రభుత్వానికి వస్తుందన్నారు.

"సింగరేణి సంస్ధపై బీఆర్ఎస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తోంది. బీఆర్ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను ఓటుబ్యాంక్​గా ఉపయోగించుకున్నారు. కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా సింగరేణిని దోచుకుని ఆర్థిక విధ్వంసం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోము".- కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

తెలంగాణ ఏపీల్లో ఏ రాష్ట్రం పట్ల మాకు వివక్ష లేదు : కిషన్​ రెడ్డి - kishan reddy about BJP New Government

ఇచ్చిన హామీలను అమలు చేస్తాం - తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం : కిషన్ ​రెడ్డి - KISHAN REDDY on bjp manifesto

Last Updated : Jun 22, 2024, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details