Kishan Reddy fires on State Govt :తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని. కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ యువతకు ఇస్తామన్న యూత్ డిక్లరేషన్ సంగతేంటి? : కిషన్ రెడ్డి - Kishan Reddy on Congress Assurances
థర్మల్ ప్లాంట్ నిర్మాణం : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.
విద్యుత్ భద్రతపై దృష్టి : రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023న, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చి 2024న ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 4వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2,400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని, రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోందన్నారు.
విద్యుత్ ఉత్పత్తికి ఎన్టీపీసీతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఎన్టీపీసీ-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనని తెలిపారు.
స్పందన కరవు : దీనికి అనుగుణంగానే పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. గత ఏడాది అక్టోబర్ 5న, ఈ ఏడాది జనవరి 9న, జనవరి 29న ఆ తర్వాత మొన్న ఏప్రిల్ 29న లేఖలు రాస్తే వీటికి టీఎస్ ట్రాన్స్ కో నుంచి సమాధానం లభించలేదని తెలిపారు. ఇన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో, దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందని ఎన్టీసీపీ రాసిన లేఖలు స్పష్టం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే అని, కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా, దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందని మరోసారి నిరూపితమైందన్నారు.
సీఎం ఇలాకాలో కాషాయ జెండా రెపరెపలు - పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజాగ్రహం : కిషన్ రెడ్డి - Kishan Reddy On Lok Sabha Result
మన రాష్ట్ర సంస్కృతి సంప్రాదాయలకు ప్రతీక బోనాల పండుగ : కిషన్‌రెడ్డి - union minister kishan reddy