AMARAVATI RAILWAY PROJECT: అమరావతి రైల్వే అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 వేల 245 కోట్ల రూపాయలతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ కొత్త లైన్ నిర్మాణం జరగనుంది. ఈ లైన్ ద్వారా దక్షిణ భారతాన్ని మద్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చెందనుంది. అమరావతికి రైల్వేలైన్ మంజూరు కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Amaravati Railway line (ETV Bharat) కృష్ణా నదిపై మరో బ్రిడ్జ్:అదే విధంగా దీనిని మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం ద్వారా 19 లక్షల పని దినాలు కల్పన జరుగుతుంది. ఈ లైన్ నిర్మాణంతో పాటు 25 లక్షల చెట్లు నాటుతూ కాలుష్య నివారణకు కూడా కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్‌ని నిర్మించనున్నారు. కొత్తగా రైల్వే లైన్ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మాణం జరగనుంది.
Amaravati Railway line (ETV Bharat) ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన గడ్కరీ - 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు మంజూరు
దీంతో పాటు తెలంగాణలో ఖమం జిల్లా, ఏపీలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం అవుతుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, బిహార్‌కి రెండు కీలక రైల్వే ప్రాజక్టులకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ. 6,789 కోట్ల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజక్టులకు ఆమోదం తెలిపారు.
"అమరావతి"కి ప్రత్యక్ష కనెక్టివిటీ: ఏపీ రాజధాని అనుసంధానానికి 57 కి.మీ, బిహార్‌లో 256 కి.మీ రెండు ప్రాజక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త లైన్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని "అమరావతి"కి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుందని అశ్వనీ వైష్ణవ్ అన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజల రవాణాకు మెరుగైన వ్యవస్థలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుళ-ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను సులభతరం చేయడంతోపాటు రద్దీని తగ్గిస్తుందన్నారు. భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే విభాగాలలో చాలా అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తుందని అన్నారు.
ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం:అమరావతికి రైల్వేలైన్ మంజూరు కావడంపై ప్రధానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వేలైన్‌తో అమరావతికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుందని, 57 కి.మీ మేర రైల్వేలైన్ నాలుగేళ్లలో పూర్తవుతుందని అన్నారు. కాలుష్య నివారణకు 25 లక్షల చెట్లు నాటుతున్నారని అన్నారు. విశాఖ రైల్వేజోన్ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్న చంద్రబాబు, భూసేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక జెట్ స్పీడ్‌లో అమరావతి పనులు - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు