Unemployed Protest to Postpone Group-2 Exams :రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు డీఎస్సీ, గ్రూప్-1 అభ్యర్థులు పరీక్షల నిర్వహణ మార్పులు తమ గళం వినిపించగా, తాజాగా గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులు హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బైఠాయించి నిరసన తెలియజేశారు.
గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగుల ధర్నా - Unemployed Protest on Group 2 Exams - UNEMPLOYED PROTEST ON GROUP 2 EXAMS
Unemployed Demonstration at Ashoknagar Cross Road : గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించారు. ఈ రాస్తారోకోలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు.
Published : Jul 13, 2024, 9:52 PM IST
|Updated : Jul 13, 2024, 10:39 PM IST
ఈ రాస్తారోకో కార్యక్రమంలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి పడిపోయాడు. అభ్యర్థుల ఆందోళనతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు గ్రూప్ 2 లేదా గ్రూప్ 1కు మాత్రమే సిద్ధం కావాల్సి వస్తుందని, ఒక పరీక్ష కోల్పోవటం జరుగుతుందని వాపోయారు. గ్రూప్ 2, గ్రూప్ 3 షెడ్యూల్ ఒకే సమయానికి ఉండటం వల్ల అలాగే ఈ రెండింటి పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 డిసెంబర్లో నిర్వహిస్తే గ్రూప్ 1 మెయిన్స్‌కు ప్రిపరేషన్‌కు టైమ్ ఉంటుందన్నారు. ఈ ధర్నాకు భారీస్థాయిలో నిరుద్యోగులు హాజరై తమ నిరసనను తెలిపారు.