తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉగాది పర్వదినాన కళకళలాడిన తెలుగు లోగిళ్లు - విదేశాల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్న తెలుగువారు - Ugadi Celebrations In Telangana - UGADI CELEBRATIONS IN TELANGANA

Ugadi Celebrations In Telangana : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు లోగిళ్లు నూతన ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి. తెలుగు నాట క్రోధి పేరిట వచ్చిన కొత్త సంవత్సరాది సందర్భంగా ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తి దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ, పిండి వంటకాలను ఆరగించారు. పంచాంగ శ్రవణాలు విని భవిష్యత్తుపై అంచనాలు వేసుకున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల విభిన్న రీతుల్లో పండగను జరుపుకోగా విదేశాల్లోనూ తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Ugadi Celebrations In Telangana
Ugadi Celebrations In Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 9:01 PM IST

ఉగాది పర్వదినాన కళకళలాడిన తెలుగు లోగిళ్లు - విదేశాల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్న తెలుగువారు

Ugadi Celebrations In Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పర్వదిన సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా షడ్రుచుల పచ్చడి సేవిస్తూ పిండి వంటలు ఆరగించారు. పండగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున దేవాలయాలను సందర్శించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారిని నూతన వస్త్రాలతో అలంకరించి ఉత్సవారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉగాది, శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పంచాంగాన్ని(Panchangam) అర్చకులు పఠించారు.

Ugadi Celebrations AT Warangal :వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి గులాబీలతో లక్ష పుష్పార్చన నిర్వహించగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో దేవత మూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోనూ ఉగాది పండగ సందర్భంగా గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారికి పొంగళ్ళు సమర్పించారు. స్తంభాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో సేంద్రియ పద్ధతిలో సిరిధాన్యాలు పండించే రైతులకు సన్మానం చేశారు.

Ugadi Celebrations 2024 : ఉగాది పండగ వేళ ఆలయాలు కిక్కిరిసిపోవడంతో పాటు పలుచోట్ల విభిన్న రీతుల్లో పర్వదినాన్ని జరుపుకున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యంనాన్‌పల్లి గ్రామంలో ఓ అభిమాని ఈటీవీ లోగోతో ముగ్గు వేసి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీపై తమకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. షడ్ రుచులతో తెలుగు కొత్తసంవత్సరానికి(Telugu New Year) అందరూ స్వాగతం పలుకుతుంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ముత్యాలమ్మ దేవతకు కోళ్లు, మేకలను బలిచ్చి భోనం పెట్టి గ్రామస్థులు(villagers) తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.‌ అదే జిల్లాలోని మోత్కూరులో సంబరాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో గ్రామస్థులు తరలిరాగా బోనాలు ఎత్తుకుని మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎడ్లబండ్లు సహా ఇతర వాహనాల ప్రదర్శన మిక్కిలి ప్రజలను ఆకట్టుకుంది..

విదేశాల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్న తెలుగువారు
వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉగాది(Ugadi Celebrations) పర్వదినం సందర్భంగా మంగళవారం ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నాగళ్లతో పొలం దున్నారు. క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి(State Government) ఎలాంటి ఆటంకాలు కలగకూడదని కోరుకున్నారు. ఉగాది పండుగ వేడుకలు విదేశాల్లో సైతం తెలుగువారు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలోని స్వామి నారాయణ్ ఆలయంలో రాష్ట్రానికి చెందిన పలువురు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో ఉగాది వేడుకలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఇంటి నుంచి ప్రజలు తరలివచ్చి గోదావరి నీటిని డబ్బు చప్పులతో ఊరేగించి గ్రామంలో ఉన్న దేవాలయాలన్నింటిని శుభ్రం చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు

జోరుగా ఉగాది సంబురాలు - ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎడ్ల బండ్ల పోటీలు - Bullock Cart Race

ఉగాది వేళ కొత్త సంకల్పం తీసుకోవాలి - ప్రకృతితో కలిసి జీవించాలి : వెంకయ్యనాయుడు -

తెలుగు వాకిళ్లల్లో క్రోధి నామ సంవత్సరం సందడి - ఉగాది వేళ కళకళలాడుతున్న మార్కెట్లు

ABOUT THE AUTHOR

...view details