Ugadi Celebrations at BJP Office in Hyderabad :బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ఏర్పాటుచేశారు. ఉదయం సుదర్శన హోమం నిర్వహించారు. ఈ హోమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman), ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, మహేశ్వర్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, సైదిరెడ్డి, విజయరామారావు, పార్టీ శ్రేణులు పాల్గొని కాకునూరి సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం విన్నారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే మళ్లీ వస్తోందని, వెలుగులను ప్రపంచానికి అందించేది భారత దేశమని కాకునూరి సూర్యనారాయణ మూర్తి తన పంచాంగ శ్రవణంలో తెలిపారు. సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. వర్తమాన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. కొత్త వ్యాధులు తలెత్తవని, ధరలు నిలకడగా ఉంటాయని తెలిపారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు(Telugu State People) సంతోషంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.
Kishan Reddy Extends Ugadi Wishes to Telugu People :తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా ఉగాది పండగను జరుపుకుంటున్నారన్నారు. పంచాంగం ఆధారంగా ప్రతి హిందువు వచ్చే ఉగాది వరకు శుభకార్యాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. క్రోధి నామ సంవత్సరం ప్రాధాన్యత కల్గిందని, ఈ సంవత్సరంలో దేశంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు.