Road Accident at Kotur Today :నేటికాలంలో వాహనంపై బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తామన్న నమ్మకం లేకుండా పోయింది. ఇక ద్విచక్ర వాహనంపై వెళ్తున్నామంటే చాలు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డుపై మనం సరిగ్గానే వెళ్తున్నా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్ల ఓ ఇల్లాలు, పండంటి పసిపాప ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం రోజున సరదాగా గడపడానికి బంధువుల ఇంటికి వెళ్తున్న ఆ కుటుంబానికి తీరని శోకం ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో డ్రైవర్ : బెంగళూరు జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ స్టీరింగ్‌పై పట్టు కోల్పోవడంతో ఎదురుగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లితో సహా ఏడాది వయసున్న చిన్నారి దుర్మరణం చెందారు. ఈ సంఘటన కొత్తూరు మండలం చేగూరు చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. కొత్తూరు సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక రాష్ట్రం హుగ్లీ నుంచి ఓ లారీ గూడ్స్‌తో హైదరాబాద్‌కు వస్తోంది. సంబంధిత లారీ డ్రైవర్ షేక్ మహమ్మద్ మద్యం సేవించాడు.