Two MNREGA Workers Dead In Siddipet : ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై బండరాళ్లు, మట్టి పెళ్లలు పడటంతో తల్లీ కుమార్తెలు మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఉపాధి కూలీలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : గోవర్ధనగిరిలోని సంజీవరాయని గుట్ట వద్ద 45 రోజులుగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధి కూలీలు గుట్ట కింద మట్టి తవ్వి పొలం బాటలు నిర్మించేందుకు తరలిస్తున్నారు. ఈ పనులకు గురువారం 21 మంది కూలీలు హాజరయ్యారు. కొందరు గడ్డ పారలతో మట్టిని తవ్వుతుండగా, పైనుంచి బండరాళ్లు, మట్టి పెళ్లలు ఒక్కసారిగా కిందికి జారిపడ్డాయి. దాంతో పలువురు వాటి కింద చిక్కుకుపోయారు.