Two Drug Dealers Arrested in Panjagutta :మాదక ద్రవ్యాల దందాలో దేశంలోని మరో కీలక ముఠా పోలీసులకు చిక్కింది. ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌తో ముడిపడ్డ నెట్‌వర్క్‌ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. గోవా నుంచి భాగ్యనగరానికి తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సహా భారీగా మత్తుపదార్థాలు విక్రయిస్తున్న మరో పాలస్తీనా వ్యక్తిని రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ పంపిణీ(Drug supplying) చేసే 14మంది స్మగ్లర్లు, హైదరాబాద్‌కు చెందిన 31 మంది వినియోగదారులు పేర్లు బయటపడ్డాయి.
Drug suppliers Arrest In Hyderabad :అరేబియాకు చెందిన సయీద్ అలీ మహ్మద్ అలియాస్ సయీద్ సిరియాలో ఉండేందుకు పాలస్తీనా శరణార్థిగా ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకున్నాడు. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి విద్యార్థి వీసా తీసుకుని సోదరుడితో కలిసి 2009లో హైదరాబాద్ వచ్చాడు. టోలిచౌకిలో నివాసముంటూ సైఫాబాద్ పీజీ కళాశాలలో డిగ్రీ, సెయింట్ మేరి కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశాడు. వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటూ 2018లో ఆధార్ కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా సంపాదించాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్‌లో ఉంటూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ సయీద్ నగరంలో విక్రయాలు(selling) మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబయిలో ఉండే నైజీరియన్లు, ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడు.
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా - మైనర్ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్