Deputy CM Bhatti Vikramarka House Robbery Case: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌ను విచారించారు.
డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ - ఖరగ్‌పూర్‌లో ఇద్దరు దొంగల అరెస్ట్ - Robbery In Bhatti Vikramarka House - ROBBERY IN BHATTI VIKRAMARKA HOUSE
Robbery In Deputy CM Bhatti Vikramarka House : రాష్ట్ర డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క మల్లు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. ఈ చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు.
Robbery In Deputy CM Bhatti Vikramarka House (ETV Bharat)
Published : Sep 27, 2024, 5:21 PM IST
వీరిద్దరూ భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన వారని ఎస్పీ వెల్లడించారు. దీనిపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.