ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉన్నట్లు హిందూయేతరులు పత్రాన్ని ఇవ్వాలి - TTD set up Rules Boards - TTD SET UP RULES BOARDS

TTD set up Boards Explaining Rules for Visiting Tirumala: తిరుమలలో అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉన్న నిబంధనలు వివరిస్తూ టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద బోర్డులు పెట్టింది. దేవదాయ చట్టం మేరకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో వివరించారు.

ttd_set_up_rules_boards
ttd_set_up_rules_boards (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 5:39 PM IST

Updated : Sep 27, 2024, 8:04 PM IST

TTD set up Boards Explaining Rules for Visiting Tirumala:మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో అన్యమతస్థుల శ్రీవారి దర్శన నిబంధనలు వివరిస్తూ తిరుమలలో టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. దర్శనానికి వెళ్లాలంటే తప్పక పాటించాల్సిన, అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద బోర్డులను ప్రదర్శనకు ఉంచారు. ఎండోమెంట్ చట్టం మేరకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. డిక్లరేషన్ ఫారాలు అదనపు ఈఓ కార్యాలయం, వైకుంఠం కాంప్లెక్స్, రిసెప్షన్, అన్ని ఉప విచారణాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని బోర్డుల ద్వారా తెలియచేశారు.

డిక్లరేషన్ పత్రంపై సంతకం పెట్టాలని డిమాండ్: జగన్ తిరుమలకు వస్తే దేవాదాయశాఖ తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ పత్రంపై సంతకం పెట్టాలని కూటమి నేతలు, హైందవ సంఘాలు పట్టుబట్టాయి. సంతకం పెట్టిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలంటూ ఆందోళనలు తీవ్రం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన సంప్రదాయాల వివరాలతో తిరుమలలో తితిదే బోర్డులు ఏర్పాటు చేసింది. హైందవేతరులు ఆలయం ప్రవేశం చేయాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్న నిబంధనలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.

Last Updated : Sep 27, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details