Tirumala Srivari Arjitha Seva Tickets for February 2025 :భక్తుల సౌకర్యార్థం కోసం 2025 ఫిబ్రవరికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవ, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్ల కోటాను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు స్పెషల్ ఎంట్రీ దర్శన టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ నెల 25వ తేదీనా ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను ప్రారంభిస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లాగిన్ అయ్యి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
యాదాద్రి 'లడ్డూ' రిజల్ట్స్ వచ్చేశాయ్ - స్వచ్ఛత పరీక్షల్లో ఏం తేలిందంటే?