TTD on Local People Darshan Tickets : ఫిబ్రవరి 11వ తేదీన తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందుకోసం ఈ నెల 9న టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఫిబ్రవరి 9వ తేదీన తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాలులో, తిరుపతిలోని మహతి ఆడిటోరియం వద్ద దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. అయితే ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకల కారణంగా ఫిబ్రవరి నెలలో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి మార్చిన విషయం తెలిసిందే.
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - ఫిబ్రవరి 9న టోకెన్ల జారీ, ఎక్కడంటే? - TTD ON LOCAL PEOPLE DARSHAN TICKETS
ఫిబ్రవరి 11వ తేదీన తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్న టీటీడీ
![తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - ఫిబ్రవరి 9న టోకెన్ల జారీ, ఎక్కడంటే? TTD on Local People Darshan Tickets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/1200-675-23504274-thumbnail-16x9-ttd-on-local-people-darshan-tickets.jpg)
TTD on Local People Darshan Tickets (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2025, 10:41 PM IST