TS ICET Notification 2024: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లను విద్యా మండలి ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈఏపీసెట్, లాసెట్ విడుదలవ్వగా తాజాగా ఐసెట్ షెడ్యూల్‌ని రిలీజ్ చేసింది. ఎంబీఏ(MBA), ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రోఫెసర్ తాటికొండ రమేశ్ వెల్లడించారు. మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసం రూ.250తో మే 17 వరకు, రూ.500తో మే 27వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో ఆన్లైన్లో ఐసెట్ పరీక్షలు(I CET Exam Date) జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షకు డిగ్రీ చదివిన విద్యార్థులు అర్హులు.
టీఎస్ ఈఏపీసెట్‌గా మారిన ఎంసెట్, మే 9 నుంచి ప్రవేశపరీక్షలు
ఐసెట్-2024 షెడ్యూల్ వివరాలు :
క్రమ సంఖ్య | అంశం | ముఖ్యమైన తేదీలు |
1 | నోటిఫికేషన్ విడుదల | మార్చి 5 |
2 | దరఖాస్తుల స్వీకరణ(ఆలస్య రుసం లేకుండా) | మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 |
3 | ఆలస్య రుసం రూ.250తో దరఖాస్తు స్వీకరణ | మే 17 |
4 | ఆలస్య రుసం రూ.500తో దరఖాస్తు స్వీకరణ | మే 27 |
5 | పరీక్ష | జూన్ 4, 5 |