నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి రెండేళ్లు పెంపు - వయో పరిమితి పెంపు
TS Govt maximum age limit Extended 44 To 46 : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గరిష్ఠ వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది.
TS Govt maximum age limit Extended 44 To 46
Published : Feb 12, 2024, 1:47 PM IST
TS Govt maximum age limit Extended 44 To 46 : నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ మరో తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల గరిష్ఠ వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు 44 ఏళ్లుగా ఉన్న వయస్సు పరిమితి, 46 ఏళ్లకు పెంచింది. ఇందులో యూనిఫామ్ సర్వీసెస్‌కు మినహాయింపు ఇచ్చింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నట్లు తెలిపింది.