తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ దేవతకు తలనీలాలతో పాటు కనుబొమ్మలూ సమర్పిస్తారట - ఎక్కడంటే?

తలనీలాలు, కనుబొమ్మలు సమర్పించేందుకు బారులు తీరిన చిన్నారులు- ఇది వారి తరతరాల ఆచారమని తెలిపిన గిరిజనులు

ETMASUR GODDESS IN ADILABAD
ADILABAD TRIBAL TRADITIONS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Adilabad Tribal People: మనం ఏదైనా కోరిక మనసులో అనుకుని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాం. నా కోరిక తీర్చు దేవుడా అని. అనుకున్నట్లుగానే మన పనులు జరిగితే కొద్ది రోజుల తర్వాత మొక్కిన దేవుడికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటాం. కానీ ఇంద్రవెల్లిగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల ఆచార తీరుతెన్నులు మాత్రం వినగానే అవున? ఇలా కూడా చేస్తారా? అనిపిస్తాయి.

సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం దేవుడికి మొక్కు తీర్చుకునేందుకు తలనీలాలు సమర్పిస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీలు మాత్రం తలనీలాలతో పాటు కనుబొమ్మలూ సమర్పిస్తారు. ఆదివాసీల దేవత అయిన ‘ఏత్మాసూర్‌’కు గిరిజన చిన్నారులు, యువకులు కనుబొమ్మలు, తలనీలాలు సమర్పించే ఆచారం ఏళ్లుగా కొనసాగుతోందట.

వంద మంది : వీటిని సమర్పించే సమయంలో వెంట్రుకలు కింద పడకుండా ఇంటి ఆడపడుచులు లేదా మేనత్తలు కొంగు చాచి అందులో జాగ్రత్తగా పట్టుకుంటారు. అంతకుముందు ఆడపడుచులు వారి ఇంటి నుంచి నువ్వులు, బెల్లం, కుడుకలు తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుతిగూడ గ్రామానికి చెందిన 100 మంది చిన్నారులు, యువకులు శుక్రవారం కనుబొమ్మలతో పాటు తలనీలాలను సమర్పించి ఏత్మాసూర్‌ దేవతకు మొక్కు తీర్చుకున్నారు.

ఓ యువకుడు కనుబొమ్మలు సమర్పిస్తుండగా వాటిని పట్టుకొనేందుకు కొంగు చాచిన మహిళ. ఈటీవీ భారత్, ఇంద్రవెల్లి (ETV Bharat)

బండపై పాయసం ఉంచి నాకితే : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్‌లోనూ ఇలాంటి వితం ఆచారం ఒకటి ఉంది. బండపై నైవేద్యాన్ని ఉంచి నాకితే వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు బాగా పండుతాయని అక్కడి వారి విశ్వాసం. ఈ వింత ఆచారాన్ని ఆ గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా 'బండమీది పాయసం' అనే కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగా పండాలని కోరుకుంటూ బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వద్ద 'బండమీది పాయసం' అనే వినూత్న కార్యక్రమాన్ని గ్రామస్థులు నిర్వహిస్తారు. కొండగుట్టల మధ్య వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసం ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

బాబోయ్ పెద్దపులి - ఎవరూ బయటకు వెళ్లొద్దు - ఆదిలాబాద్​లో టైగర్ టెర్రర్

ఆదిలాబాద్​ జిల్లాపై వరాల జల్లు - ఇందిరమ్మ ఇళ్ల పథకంపై భట్టి కీలక వ్యాఖ్యలు - Bhatti on Indiramma Housing Scheme

ABOUT THE AUTHOR

...view details