Tragedy Incidents on Vinayaka Chavithi Today:మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటు చేసుకుంది. మిర్యాల అర్జునరావు (61) అనే వ్యక్తి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని మామిడి ఆకులు కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న గెడ్డం నాంచారయ్య (36) మా అనుమతి లేకుండా ఇంటిలోని మామిడి ఆకులు ఎలా కోస్తారని అర్జునరావుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాట మాట పెరిగి నాంచారయ్య వంటగదిలోని కత్తి తీసుకువచ్చి మిర్యాల అర్జునరావుపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తల్లి, కుమారుడు దుర్మరణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరయ్యపల్లెమెట్ట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లి, కుమారుడు దుర్మరణం చెందారు. మృతులు వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం నందిపల్లెకు చెందిన కాంతమ్మ, జగదీశ్వర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీ కొట్టడంతో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుమారుడిని కొట్టిన టీచర్ - చర్యలు తీసుకోవాలని తండ్రి పోరాటం - Father Complaint on teacher