CM Chandrababu Tweet On Appointed New Vice Chancellors : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని ఆయన తెలిపారు. భావి పౌరులను రూపొందించడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబీయింగ్ వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్ ఆధారిత వ్యవస్థ విజ్ఞాన కారణానికి సేవ చేయడానికి అర్హులైన వ్యక్తులను నియమించేలా చేస్తుందన్నారు.
వైస్-ఛాన్సలర్‌గా ఎస్టీ మహిళ : సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ విధానం ఇప్పటికే ఫలితాలను అందిస్తోందన్నారు. మొట్టమొదటిసారిగా ఎస్టీ మహిళ, ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యారన్నారు. ఇది విద్య, సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయిగా సీఎం పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ ఆయన అభినందించారు. విద్య విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని 'ఎక్స్' వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
Today marks a fresh chapter for higher education in Andhra Pradesh. Vice Chancellors will now be appointed purely on merit, following established procedures. Higher education plays a key role in shaping future citizens, but under the previous regime, political influence and…
— N Chandrababu Naidu (@ncbn) February 19, 2025
మొదటి విడతగా తొమ్మిది వీసీ పోస్టులు : విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక కోసం దాదాపు ఆరు నెలలపాటు మంత్రి నారా లోకేశ్ కసరత్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికి కలిపి 2వేల దరఖాస్తులు రాగా, 512 మందికిపైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటన్నింటిని వడపోసి మొదటి విడతగా తొమ్మిది వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైన వీసీలలో నలుగురు ఇంజినీరింగ్, ముగ్గురు సైన్స్, ఇద్దరు సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే నలుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
పలు వర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకం - ప్రతిభావంతులకే అవకాశం
డ్యూయల్ డిగ్రీతో ఉద్యోగ అవకాశాలు - ఆంధ్రా విశ్వవిద్యాలయం శ్రీకారం - Dual Degree Courses in AU