Tirumala Srivari Chinna Sesha Vahanam : చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడని భక్తుల నమ్మకం.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి హంస వాహనంపై కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు- కలి దోషాలు తొలగించే అశ్వ వాహనసేవ
హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం - Hanumantha Vahana Seva