తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారా ? - అయితే కాస్త జాగ్రత్త! - TRAFFIC HYDERABAD VIJAYAWADA ROAD

సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగుపయనమైన నగర వాసులు - హైదరాబాద్‌-విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు - చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ కూడళ్లలో వాహనాల రద్దీ

VEHICLES MOVING SLOWLY
TRAFFIC ON HYDERABAD VIJAYAWADA HIGH WAY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2025, 7:14 PM IST

Updated : Jan 18, 2025, 7:52 PM IST

Heavy Traffic on Hyderabad - Vijayawada Highway :సంక్రాంతి సంబురం ముగిసింది. ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలు కూడా మొదలయ్యాయి. పండుగ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఊళ్లకు వెళ్లిన వారంతా తిరిగి వస్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. చాలామంది సొంత వాహనాల్లోనే వస్తుండటంతో హైవేపై రద్దీ ఎక్కువగా ఉంది. వేల సంఖ్యలో వెహికల్స్​తో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్, తూప్రాన్‌పేట, ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారా ? - అయితే కాస్త జాగ్రత్త! (ETV Bharat)

పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం సిబ్బంది 12 టోల్ బూత్​లు ఓపెన్ చేశారు. మరోవైపు నల్గొండ, రాచకొండ పోలీసులు హైవేపై ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నారు. ఈ రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశముంది. రేపు ఆదివారం కావడంతో పండుగకు వెళ్లిన మిగతా వారు కూడా హైదరాబాద్ చేరుకోనున్నారు.

Last Updated : Jan 18, 2025, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details