ETV Bharat / state

తెలంగాణలో పెరుగుతున్న నెలవారీ వినియోగం - ఆ విషయంలో పట్టణాల కంటే గ్రామాల్లోనే అత్యధిక వాడకం - CONSUMPTION EXPENDITURE IN TG

తెలంగాణలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం పెరుగుదల - గ్రామాల్లో, పట్టణాల్లో పెరుగుతున్న నెలవారీ వినియోగం - కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడి

Monthly Consumption Expenditure in Telangana
Monthly Consumption Expenditure in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 1:54 PM IST

Monthly Consumption Expenditure in Telangana : రాష్ట్రంలో ఏడాది కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం పట్టణాల్లో రూ.820, గ్రామాల్లో రూ.633లకు పెరిగిందని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. దీంతో తలసరి నెలవారీ ఖర్చు పెరిగింది. గ్రామాల్లో రూ.5,435కి, పట్టణాల్లో రూ.8,978కి చేరినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం చూసుకుంటే రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ.6,199గా ఉంది. పట్టణాల్లో తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, గ్రామీణంలో కేరళ తలసరి ఆదాయంలో(రూ.6,611) అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఆదాయ వర్గాల వారీగా చూస్తే తెలంగాణలో గరిష్ఠంగా నెలకు రూ.12,619 ఖర్చు అవుతుంది.

రాష్ట్రంలో సర్వే వివరాలు :

  • విద్యపై గ్రామీణ ప్రాంతాల్లో నెలకు తలసరి రూ.183, పట్టణాల్లో రూ.713.89 ఖర్చు చేస్తున్నారు. పట్టణాల్లో చదువుల కోసం తెలంగాణలోనే అత్యధిక వ్యయం అవుతోందని నివేదిక తెలిపింది.
  • పట్టణాల్లో అద్దెకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు.
  • గ్రామాల్లో వైద్యం కోసం నెలకు రూ.376 ఖర్చు చేయగా, పట్టణాల్లో నెలకు రూ.426 చొప్పున వ్యయం అవుతుందని సర్వే పేర్కొంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే మాత్రం ఈ వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వ్యయం తక్కువగా ఉంది.
  • మద్యం, పాన్‌, పొగాకు తదితర ఉత్పత్తుల కోసం పట్టణాల్లో నెలకు రూ.320 ఖర్చు చేయగా, గ్రామాల్లో నెలకు రూ.396 ఖర్చు చేస్తున్నారు.
  • ఆహార ఖర్చులో పానీయాలు, ప్రాసెస్ట్‌ఫుడ్‌ కోసం గ్రామాల్లో 20.84 శాతం, పట్టణాల్లో 33.63 శాతం ఖర్చు చేస్తున్నారు.

దేశంలో నిర్వహించిన సర్వే వివరాలు :

  • దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం ఖర్చులో ఆహార వ్యయం గ్రామాల్లో 47 శాతం ఉండగా, ఇందులో ప్రాసెస్డ్‌ ఫుడ్‌, పానీయాలు కోసం 9.84 శాతం ఖర్చు చేస్తున్నారు. అలాగే రవాణా 7.59 శాతం, వైద్యం కోసం 6.83 శాతం, దుస్తులు, చెప్పుల కోసం 6.63 శాతం వెచ్చిస్తున్నారు.
  • పట్టణాల్లో ఆహార వ్యయం 40 శాతంగా ఉండగా, ఇందులో పానీయాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వాటా 11.09 శాతంగా నమోదు అయింది. ఇతరాల్లో రవాణా కోసం 8.46 శాతం, వస్తువులు, వినోదానికి 6.92 శాతం, డ్యూరబుల్‌ గూడ్స్‌ కోసం 6.87 శాతం, అద్దెకు 6.58 శాతం ఖర్చు చేస్తున్నారు.
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం పెరుగుతున్న కొద్దీ వ్యయం అంతరం పెరుగుతూ ఉండగా, పదేళ్ల క్రితం తలసరి వ్యయంతో పోలిస్తే విద్యపై వ్యయం తగ్గింది. వైద్యంపై వ్యయం పెరిగింది. పట్టణాల్లో 5.9 శాతం, గ్రామాల్లో 6.8 శాతం వైద్యానికి ఖర్చు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1.76 లక్షలు అప్పు - ఈ నివేదిక ఇదే చెబుతోంది - Telangana Per Capita Income 2024

India GDP Growth Rate : తలరాత మార్చే తలసరి ఆదాయం.. 2047 నాటికి భారత్​ లక్ష్యం నెరవేరేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.