ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే! - VANJANGI CLOUD HILLS

పాడేరులో వంజంగి కొండల్లో సూర్యోదయం - మేఘాల మీదుగా చూసే అవకాశం

vanjangi_hills_in_paderu
vanjangi_hills_in_paderu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2024, 3:44 PM IST

Updated : Dec 8, 2024, 3:53 PM IST

vanjangi hills :అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న ఈ ప్రాంతంలో కొండ మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ ఆపసోపాల పడుతూ పైకి వచ్చారు. అయితే మేఘాల కొండలపైన వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ కష్టాన్ని మరచిపోయామని చెబుతున్నారు.

ఆ మేఘాల కొండ కోనల్లో దాగున్న కైలాస శిఖరాన్ని తిలకించేందుకు పర్యాటకులు ప్రాణాలకు తెగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండ గత నాలుగేళ్లుగా విశేష ఆదరణ పొందుతోంది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం పర్యాటరంగానికి పెద్ద పీట వేస్తున్న తరుణంలో అధికారులు రహదారి నిర్మాణానికి సమాయత్తమయ్యారు.

స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే! (ETV Bharat)

తెల్లవారుజామున మూడు గంటలకే పర్యాటకులు పాడేరు వంజంగి చుట్టుపక్కల రిసార్ట్​ల నుంచి ప్రయాణం ప్రారంభిస్తారు. లగిసిపల్లి దాటిన తర్వాత చిన్న దారి ఎత్తైన మార్గం మధ్యలో వాహనాలు నిలిచిపోతుంటాయి. కొందరు నడిచి పైన మట్టి రహదారి చేరుకుంటారు. అక్కడి నుంచి చీకట్లో ఎత్తైన జారుడుమట్టు నుంచి మరో రెండు కిలోమీటర్లు వెళ్తారు. ఆ పైన మధ్యలో కిలోమీటర్ కొండ అటవీ ప్రాంతం గుండా నడిచి వెళ్లాలి. చివరిగా రాళ్లతో కూడిన ఎత్తైన కొండ చేరుకుని మేఘాలను అతి సమీపం నుంచి ఆస్వాదిస్తుంటారు. దీనికోసం ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి మధ్యలో అలిసిపోతారు కూడా. మధ్య మధ్యలో కొందరు ఆగిపోతున్నారు. ఎంతో కష్టపడి ప్రయాణం చేసి చివరికి చేరుకుని అన్నీ మర్చిపోతారు ఆ మరో ప్రపంచం చూసి తన్మయం చెందుతారు.

సూర్యుడి కాంతి, తేలియాడే మేఘాలను చూస్తూ స్వర్గం లో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. ఎంత కష్టాన్ని కోర్చైనా అందుకే ఇక్కడికి చేరతారు. మళ్ళీ కొండ దిగి రాళ్లు రప్పలగుండా వారి వాహనాల వద్దకు చేరుకుంటారు. 2020 కోవిడ్ తర్వాత వంజంగి మేఘాల కొండలు వెలుగులోకి రాగా పర్యాటకులు ఏటా వేలాది మంది సందర్శిస్తున్నారు. వాహనాలకు ప్రవేశ రుసుం కూడా వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులకు ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఏ సదుపాయం కూడా లేదు. మధ్య మధ్యలో ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. సూర్యోదయానికి చాలామంది చేరుకోలేకపోతున్నారు. మధ్యలోనే ఉండి పోతున్నారు.

వంజంగి కొండను చూస్తుంటే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఆ పకృతి అందాలను సెల్‌ఫోన్లలో బంధించి... మధురానుభూతి పొందామంటున్నారు. అయితే కొండపైకి వచ్చే మార్గంలో రోడ్డు వేస్తే బాగుంటుందని పర్యాటకులు చెబుతున్నారు.

ఏపీలో మరో 'ఊటీ' - చేతికందుతూ ఓలలాడించే మేఘాలు

చాలెంజ్ : "బాహుబలి గ్రాఫిక్స్​ను మించిపోయేలా!" - మీ కళ్లను మీరే నమ్మలేరు!

సినిమా గ్రాఫిక్స్​ను తలదన్నే ప్రకృతి అందాలు - అల్లూరి జిల్లాలో మంచుకొండలు చూస్తే 'వావ్' అనాల్సిందే!

Last Updated : Dec 8, 2024, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details